అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు చకోర లూనార్ లవ్ బర్డ్ సినిమా
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చకోర లూనార్ లవ్ బర్డ్ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో చింతాడ హేమారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ శనివారం నా ప్రేమ దేవతల్లే నిన్నే చూస్తున్నా అంటూ సాగే మధురమైన పాటను విడుదల చేశారు. అగ్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఈ పాటను రిలీజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హెన్రీ సంగీతం సమకూర్చగా శ్రీకృష్ణ ఆలపించారు.