బెంగళూరులో దారుణం: మహిళ మెడపై కత్తిపెట్టి గొలుసు లాక్కెళ్లేందుకు యత్నం
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
బెంగళూరు లోని ఇందిరానగర్ లో ఓ దుకాణంలో పనిచేస్తున్న మహిళను కత్తితో బెదిరించి, ఫెవిక్విక్ తో చేతులు టేబుల్ కు అంటించి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించిన నిందితుడు ప్రభురాజ్ ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.