ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు: నౌకా నిర్మాణ హబ్‌గా మారుస్తున్న ప్రభుత్వం
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దుగరాజపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో షిప్‌బిల్డింగ్, మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు మజ్గావ్ డాక్, గోవా షిప్‌యార్డు సంస్థలు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, మూడు పోర్టుల్లో కలిపి ఐదు వేల ఐదు వందల ఇరవై ఎకరాల్లో వివిధ క్లస్టర్లను అభివృద్ధి చేయనుండగా ఏటా రెండు కోట్ల తొంబై లక్షల గ్రాస్ టన్నుల సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.