వచ్చే ఏడాది ఆగస్టులో ముంబయి అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రారంభం

రిపోర్టర్: హరి స్థలం: ముంబయి-అహ్మదాబాద్

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ముంబయి అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో వచ్చే ఏడాది ఆగస్టు 15న బుల్లెట్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో సూరత్ వాపి మధ్య 97 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. 508 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైలు గరిష్ఠంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. భూకంపాలను ముందుగానే గుర్తించి రైళ్లను ఆటోమేటిక్‌గా నిలిపేందుకు ప్రత్యేక సైస్మోమీటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.