విశాఖలో వరదలో చిక్కుకున్న ఎనభై మందిని రక్షించిన పోలీసులు
రిపోర్టర్: నరేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం జిల్లా పీఎంపాలెం కొమ్మాది ప్రాంతంలోని రేఖ రెసిడెన్సీ అపార్ట్మెంట్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అపార్ట్మెంట్లో చిక్కుకున్న సుమారు 80 మంది నివాసితులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సురక్షితంగా కాపాడాయి. రాత్రి విధుల్లో ఉన్న క్రైమ్ ఎస్సై సూర్యప్రకాష్ పరిస్థితిని గమనించి వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.