భారత క్రికెట్ భవిష్యత్తు: శుభ్మన్ గిల్ అద్భుతమైన నాయకుడంటూ లాన్స్ క్లూసెనర్ ప్రశంసలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ శకం ముగిసినా జట్టుకు ఎలాంటి లోటు ఉండదని దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో శుభ్మన్ గిల్ అద్భుతమైన నాయకుడిగా రాణిస్తాడని ఆయన గట్టిగా విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా భవిష్యత్తులో గొప్ప స్టార్ ఆటగాడిగా ఎదుగుతాడని లాన్స్ క్లూసెనర్ అభిప్రాయపడ్డారు.