శ్రీకాకుళంలో వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన శంకర్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను గొండు శంకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరసవెల్లి శ్రీశైన వీధి, మావూరి వీధి, దండివీధి మరియు జెడ్పీ ఆఫీస్ వద్ద కొలువైన గణపయ్యను దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.