ఆంధ్రప్రదేశ్‌లో నేటి ముఖ్యమైన వార్తలు మరియు ప్రత్యక్ష అప్‌డేట్లు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఆంధ్రప్రదేశ్

దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్ర తీరంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా నేడు విజయవాడలో పర్యటించి క్రిటికల్ కేర్ బ్లాకులను ప్రారంభిస్తారు. మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కుమార్తె ఉదంతం కలకలం రేపింది.