యువత కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి ప్రభుత్వం 'బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026'ను ప్రారంభించింది. సచివాలయంలో ఈ పోటీల పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. షార్ట్ ఫిలింలు, ప్రత్యేక పాటల ద్వారా యువత తమ సృజనాత్మక ప్రతిభను నిరూపించుకోవాలని, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.