వైష్ణవి హత్య కేసులో ప్రతీకారం, నిందితుడిని హతమార్చిన సోదరుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: నిజామాబాద్
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రతీకారంగా ఆమె సోదరుడు గంధం సంతోష్ నిందితుడు చిట్టారి హరిబాబును నిజామాబాద్‌లోని ఆర్సెస్ చౌరస్తా వద్ద హత్య చేశాడు. మార్చిలో తన గర్భిణీ చెల్లెలు వైష్ణవిని హరిబాబు హత్య చేయగా, బెయిల్‌పై బయటికి వచ్చిన అతడిని సంతోష్ కత్తితో దాడి చేసి మర్మాభాగాలపై, మెడపై తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం సంతోష్ కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోగా, పోలీసులు దీనిని ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు.