ఢిల్లీలో మణిపూర్ సంగీతకారుడి హత్య, నిందితుల అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

దక్షిణ తూర్పు ఢిల్లీలోని కిలోకరి గ్రామంలో మణిపూర్‌కు చెందిన 54 ఏళ్ల ప్రముఖ సంగీతకారుడు సి. విక్రమ్ సింగ్‌ను కొందరు దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఇంటి ముందు మద్యం తాగుతూ అల్లరి చేస్తున్న వారిని వారించినందుకు డెలివరీ బాయ్స్, దాబా సిబ్బంది అతనిపై దాడి చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు.