ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలి ఐదుగురు పసికందుల మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ వార్డులో అర్ధరాత్రి సమయంలో ఏసీ పేలి షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ఇంక్యుబేటర్లలో ఉన్న పసిపాపలకు ఊపిరి ఆడకపోవడంతో ఇప్పటివరకు ఐదుగురు పసికందులు మృతి చెందారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, మంత్రులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సమగ్ర విచారణకు ఆదేశించారు.