లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో సూర్యనారాయణ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం వారాడ వీఆర్‌వో సూర్యనారాయణ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మ్యూటేషన్ మరియు 1బీ ఇవ్వడానికి ఆయన ఈ డిమాండ్ చేశారు. నిందితుడు గతంలో 2022లోనూ మరో లంచం కేసులో అరెస్టయినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు స్పష్టం చేశారు.