చెముడుగుంట పంచాయతీలో కోట్ల రూపాయలతో ముమ్మరంగా సాగుతున్న అభివృద్ధి పనులు
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంటలో రూ.2.32 కోట్లతో పూర్తి చేసిన 12 అభివృద్ధి పనులను ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్కల గిరిజన కాలనీలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. చెరువు బ్యూటిఫికేషన్, సిమెంట్ రోడ్లు, పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.