అనివార్య కారణాలతో బీహార్ పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్ష రద్దు
రిపోర్టర్: శివ
స్థలం: పాట్నా
బీహార్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ పరీక్ష రద్దయింది. మే 27న జరిగిన ఈ పరీక్షను కొన్ని అనివార్య కారణాలరీత్యా బీహార్ పోలీస్ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ కమిషన్ రద్దు చేసినట్లు ప్రకటించింది. అడ్వర్టైజ్మెంట్ నెం. 05/2025 కింద నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభ్యర్థులను హెచ్చరించింది.