ఓటీటీలో రణబాలి సందడి: నవంబర్ పదమూడో తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన రణబాలి సినిమా నవంబర్ పదమూడో తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ ఇండియా సంస్థ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ పోస్టును కొద్దిసేపటికే తొలగించడంతో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని, ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుందని చిత్ర యూనిట్ తెలిపింది.