మరియా షరపోవా విలాసవంతమైన భవనం విక్రయం: రెండు కోట్ల డాలర్ల లాభం

రిపోర్టర్: రమేష్ స్థలం: California

టెన్నిస్ దిగ్గజం మరియా షరపోవా కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన భవనాన్ని భారీ ధరకు విక్రయించినట్లు ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. గతంలో నాలుగు మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసిన భూమిలో ఆమె స్వయంగా ఈ ఇంటిని నిర్మించారు. జపాన్ శైలి డిజైన్తో కూడిన ఈ మూడు అంతస్తుల భవనాన్ని ఎన్బీఏ స్టార్ లూకా డొన్చిచ్ కు ఇరవై ఐదు మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం వెలువడింది.