గోదావరిఖనిలో పీటీ స్వామి కాంస్య విగ్రహ ఏర్పాటు: హరీశ్‌రావు ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: గోదావరిఖని
గోదావరిఖనిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పీటీ స్వామి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఇందుకు అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని ఆయన తెలిపారు. పీటీ స్వామి దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు హరీశ్‌రావు హాజరై నివాళులర్పించారు. పీటీ స్వామిని కోల్పోవడం సింగరేణి కార్మిక లోకానికి, పార్టీకి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.