శ్రీకాకుళంలో లంక ప్రాంతంలో చిక్కుకున్న నలుగురు గొర్రెల కాపరుల రక్షణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం సమీపంలోని లంక ప్రాంతంలో వరద నీటిలో చిక్కుకుపోయిన నలుగురు గొర్రెల కాపరులను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో సురక్షితంగా రక్షించినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. నాగావళి నదీ నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో బూర్జ మండలంలోని అల్లెన, లక్కుపురం, జి.బి.పురంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుస్తు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.