కీడు జరగకుండా తిమ్మాపూర్ గ్రామంలో ఎదురు మొక్కుల భక్తిశ్రద్ధలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గ్రామస్తులు గురువారం ఊరి చివరన ఎదురు మొక్కుల కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమీప తపాల్ పూర్ గ్రామస్తులు ఊరంపే నిర్వహిస్తుండటంతో ఆ ప్రభావం తమ గ్రామంపై పడకుండా ఉండేందుకు స్థానికులు ఈ సాంప్రదాయ వేడుకను జరుపుకున్నారు. ఊరిలో ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని కోరుకుంటూ గ్రామస్తులంతా ఏకమై పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.