మత్స్యకారుల రక్షణకు పడవల్లో ట్రాన్స్‌పాండర్లు తప్పనిసరిగా ఆన్ చేయాలి
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత కోసం పడవల్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌పాండర్లను తప్పనిసరిగా ఆన్ చేయాలని మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ స్పష్టం చేశారు. విశాఖపట్నం సమీపంలో జరిగిన ప్రమాదంలో ట్రాన్స్‌పాండర్ ఆన్ చేయకపోవడం వల్లే ఆరుగురు గల్లంతయ్యారని, దీని వినియోగంపై మత్స్యకారుల్లో మరింత అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.