నీటి సంరక్షణ అందరి బాధ్యతన్న రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కడ్తాల్
నీటి సంరక్షణ అందరి బాధ్యత అని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ పేర్కొన్నారు. కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో నిర్వహించిన జలసరి గ్రామసభలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులను దూరం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు.