ఢిల్లీలో మహిళలపై పోలీసుల దమనకాండ: జంతర్మంతర్ వద్ద ఉద్రిక్తత

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మహిళలపై ఢిల్లీ పోలీసులు దమనకాండకు పాల్పడ్డారని తులసి చందు (Thulasi Chandu - స్వతంత్ర గ్రౌండ్ జర్నలిస్ట్ & ఫ్యాక్ట్ చెకర్) వెల్లడించారు. జంతర్మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళలపై పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయని, దీనిపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.