జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఈటల రాజేందర్ భారీ బహిరంగ సభ
రిపోర్టర్: సతీష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించడమే లక్ష్యంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని జవహర్ నగర్ బాలాజీ నగర్ వేదికగా అక్టోబర్ 30వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఈ సభ జరగనుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.