పార్వతీపురం మన్యంలో చేతబడి నెపంతో దంపతులపై దాడి
రిపోర్టర్: గోపి
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పెదగైసల గ్రామంలో చేతబడి నెపంతో దంపతులపై పక్కింటి వారు దాడి చేసి గాయపరిచారు. కూలి పనులు చేసుకునే తమకు చేతబడి వచ్చంటూ తరచూ గొడవ పడేవారని, కత్తి, కర్రలతో దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భార్య తలకు తీవ్ర గాయం కాగా, భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను స్థానిక పీహెచ్సీకి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.