వందేమాతరం ఆలపించకపోతే నేరంగా పరిగణించలేమన్న సుప్రీంకోర్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

వందేమాతరం ఆలపించడానికి నిరాకరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరి మనసాక్షి అంగీకరించకపోతే వారిని బలవంతం చేయలేమని కోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను ఎవరూ ఉల్లంఘించలేరని, వ్యక్తిగత నమ్మకాలను గౌరవించాలని ధర్మాసనం అభిప్రాయపడింది.