మహిళలపై తీవ్ర వివక్ష: సోషల్ మీడియాలో కృతి శెట్టి ఆవేదన
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
మహిళలు ఎంత పరిపూర్ణంగా ఉన్నప్పటికీ జనాలు ఎప్పుడూ లోపాలు వెతుకుతారంటూ నటి కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులు తాము చేసే పనులను పెద్దగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, మహిళల పట్ల సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె చేసిన తాజా వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ చర్చలు జరుపుతున్నారు.