మహారాష్ట్రలో సంచలనం: పెళ్లి పేరుతో మోసగించి అశ్లీల వీడియోలు విక్రయించిన జిమ్ ట్రైనర్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nalasopara

పెళ్లి పేరుతో మోసం చేసి యువతిపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఎనభై మంది మహిళల రహస్య వీడియోలను అశ్లీల వెబ్సైట్లలో విక్రయించిన జిమ్ ట్రైనర్ ఆరిఫ్ షేక్ను నాలాసొపార పోలీసులు అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ విశాల్ వాల్వి వెల్లడించారు. సోమవారం రాత్రి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు అతని తల్లి రుక్సానా, కజిన్ సాహిిల్ షేక్లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.