ఐఫోన్ కొనుగోలుతో బయటపడిన దొంగతనం ఉదంతం

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

దిల్లీలోని మైదాన్ గర్ధి ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న దీపక్ అనే నిందితుడు కొత్త ఐఫోన్ 15, బట్టలు కొనుగోలు చేయడంతో పాటు మూడు లక్షల విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనేందుకు ప్రణాళిక వేసుకున్నాడు. ఈ విలాసవంతమైన ఖర్చుల ద్వారా అనుమానం వచ్చిన పోలీసులు దీపక్ ను, అతని సహచరుడు గుంజన్ ను అరెస్ట్ చేసి భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.