గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని నిమజ్జన కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వలిగొండ, రామన్నపేట మండలాల్లోని చెరువుల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జన ప్రక్రియను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.