ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ఏర్పాట్లపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
మరికాసేపట్లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన ప్రక్రియ ప్రారంభం కానుందని, మధ్యాహ్నం రెండు గంటల లోపు ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే ఉత్సవాల్లో దొంగతనాలు మరియు మహిళలపై వేధింపులను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేకంగా నిఘా టీమ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. భద్రతా చర్యలపై పోలీసు శాఖ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు.