ఆసియా పారా గేమ్స్: ఐదో స్థానానికి ఎగబాకిన భారత అథ్లెట్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

ఆసియా పారా గేమ్స్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోందని, బుధవారం ఒక్కరోజే ఇరవై ఏడు పతకాలు సాధించి మొత్తం పతకాల సంఖ్యను అరవై రెండుకి చేర్చిందని క్రీడా అధికారులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో ఐదు స్వర్ణాలతో సహా పద్దెనిమిది పతకాలు దక్కడంతో భారత్ పట్టికలో ఐదో స్థానానికి దూసుకెళ్లిందని, సిమ్రాన్, ప్రవీణ్ కుమార్, సచిన్ ఖిలారి తదితరులు కొత్త రికార్డులు సృష్టించి దేశం కీర్తిని ఇనుమడింపజేశారని నిర్వాహకులు స్పష్టం చేశారు.