కోనసీమ మున్సిపల్ ఎన్నికలు: మొదటి రోజు నామినేషన్లలో భారీగా నిరాసక్తత
రిపోర్టర్: హరి
స్థలం: అమలాపురం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం పురపాలక సంఘాలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. సెంటిమెంట్ కారణంగా అభ్యర్థులు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. అయితే కొన్ని వార్డులకు మాత్రం నామినేషన్లు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు.