వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

రిపోర్టర్: సురేష్ స్థలం: తూర్పు గోదావరి

రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దూబచర్లలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి సభలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ చర్యకు కారణమయ్యాయి. టీడీపీ నేత బోడిగడ్ల నాగరఘు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.