అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్
రిపోర్టర్: నరేష్
స్థలం: Durham
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అధిగమించి రెండో వేగవంతమైన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. డర్హామ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రూట్ ఈ ఘనత సాధించి సచిన్ టెండూల్కర్ రికార్డును వెనక్కి నెట్టగా, విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.