జన్నారంలో ఇంకుడు గుంతల నిర్మాణంతో పెరగనున్న భూగర్భ జలాలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు స్థిరంగా ఉంటాయని ఏపీవో రవీందర్ అన్నారు. వివిధ గ్రామాల్ లో అరవై ఇంకుడు గుంతలు, పదిహేను సోక్ పిట్స్ నిర్మాణాలు పూర్తి కావచ్చాయని ఆయన తెలిపారు. భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తోందని, నీటి ఎద్దడి నివారణకు ఈ ఇంకుడు గుంతలు ఎంతో దోహదపడతాయని ఆయన వెల్లడించారు.