'డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ ఖరారు': జనవరి 14 నుంచి టోర్నీ ప్రారంభం
రిపోర్టర్: సతీష్
స్థలం: కేరళ
మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్ 2027 టోర్నీని జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలాన్ని అక్టోబర్ 28న కేరళలోని కొచ్చి నగరంలో నిర్వహించనున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ఈసారి కూడా తమ సత్తా చాటేందుకు తీవ్రంగా సన్నద్ధమవుతున్నాయి.