యువ ఓటర్ల నమోదు కోసం విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: దిల్లీ

దేశ రాజధానిలో యువ ఓటర్ల నమోదును గరిష్టస్థాయికి చేర్చడమే లక్ష్యంగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది, ముప్పై తేదీల్లో అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు దిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు గలిగిన యువత ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఫారం ఆరును పూర్తి చేయాలని అధికారులు సూచించారు. కళాశాలల్లో అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచడంతో పాటు బూత్ స్థాయి అధికారులను విధుల్లోకి నియమించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.