శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం: రిజర్వాయర్లో పడి ఐదుగురు మహిళలు దుర్మరణం

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీసత్యసాయి జిల్లా

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ ప్రాంతంలోని గొల్లపల్లి రిజర్వాయర్లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఐదుగురు మహిళలు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఈత రాకపోవడం మరియు నీటి లోతు సరిగ్గా తెలియక పోవడం వల్లనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ఈ హృదయ విదారక ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.