'లంచం డిమాండ్ చేస్తే ఊరుకునేది లేదు': కీసరలో ఏసీబీ అధికారుల దాడులు
రిపోర్టర్: మహేష్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వేళా దాడులు నిర్వహించి సంచలనం సృష్టించారు. ఒక కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, లంచం తీసుకునే బాధ్యతను ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డికి అప్పగించారు. విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, కీసర చెరువుగట్టు వద్ద ఎస్ఐ రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.