తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన కింద రెండు లక్షల ఇళ్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
దేశంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు దాదాపు 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి కేంద్రం తరఫున రూ.1.20 లక్షల ప్రాథమిక ఆర్థిక సాయం అందించనుండగా, వివిధ పథకాలతో కలిపి రూ.1.80 లక్షల వరకు సాయం అందనుంది. అలాగే నెలవారీ ఆదాయ పరిమితిని రూ. 10,000 నుంచి రూ. 15,000కు పెంచడంతో పాటు స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి అదనంగా రూ. 12,000 కేటాయించారు.