భారీ వర్షాలతో విజయనగరం జిల్లాలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేగిడి, వంగర మండలాల్లోని ఇరవై ఐదు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. వాగులు, గెడ్డలు పొంగి ప్రవహించడంతో విద్యార్థులు బడులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చీపురుపల్లి మండలం కర్లాం ఉన్నత పాఠశాలలో చెట్లు కూలి ప్రహరీలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా నూట అరుబై ఎనిమిది పాఠశాలల్లో రెండు వందల డెబ్బై తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయని, ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు డీఈవో యు.మాణిక్యం నాయుడు వెల్లడించారు.