గుండెపోటు లక్షణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

యువతలోనూ గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని ఈహెచ్సీసీ హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ అజీత్ బనా వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యం, అసాధారణ ఆయాసం, చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎసిడిటీగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, మధుమేహం వంటి కారణాలతో ముప్పై, నలభై ఏళ్లవారికీ గుండెపోటు ముప్పు పొంచివుందని, సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.