నల్లమల సాగర్‌కు కృష్ణమ్మ పరవళ్లు.. రైతుల్లో కొత్త ఆశలు
రిపోర్టర్: రమేష్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ద్వారా కృష్ణానది జలాలు నల్లమల సాగర్‌కు చేరుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించడంతో ఇప్పటికే 3.24 టీఎంసీల నీరు చేరింది. దీనివల్ల దశాబ్దాల కరువు పీడిత ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందనుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.