మలేరియా నియంత్రణకు నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్ర బృందం సూచన
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
మలేరియా నిర్మూలనపై రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందం, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పర్యటించిన బృందం, ఏపీలో అమలవుతున్న సీఎం డ్యాష్‌బోర్డ్, డ్రోన్ సేవలు, దోమ తెరల పంపిణీ వంటి చర్యలను ప్రశంసించింది. 2027-32 జాతీయ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ సమీక్ష నిర్వహించినట్లు కమిషనర్ చక్రధర్‌బాబు వెల్లడించారు.