టీబీ విముక్తి భారత్ లక్ష్యంగా కసుమూరు పీహెచ్సీ తనిఖీ: డాక్టర్ ఖాదర్ వలి
రిపోర్టర్: sai
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారుల పర్యవేక్షణ ముమ్మరంగా సాగింది. అదనపు వైద్యాధికారి డాక్టర్ ఖాదర్ వలి ఆస్పత్రి రికార్డులను పరిశీలించి కీలక సూచనలు చేశారు. టీబీ, కుష్టు వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవళికతో పాటు పలువురు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.