సెలవు కోసం తోటి విద్యార్థిని చంపాలని చూసిన బాలురు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అన్నమయ్య జిల్లా

అన్నమయ్య జిల్లా గ్యారంపల్లె గురుకుల పాఠశాలలో సెలవు కోసమే తోటి విద్యార్థిని చంపేందుకు ఇద్దరు విద్యార్థులు యత్నించారు. అర్ధరాత్రి సమయంలో మరో విద్యార్థి ముఖంపై దిండుతో అదిమి, గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నించగా బాధితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు నిందిత విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపించారు.