పండగ ఆఫర్ల మోసాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం డీఎస్పీ హెచ్చరిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

పండగ ఆఫర్ల పేరిట కేటుగాళ్లు సాగిస్తున్న మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి హెచ్చరించారు. తక్కువ ధరలకు వస్తువులు ఇస్తామంటూ నమ్మించి డబ్బులు వసూలు చేసి మోసం చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనుమానాస్పద ఆఫర్లు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.