పాలకొండ మండలంలో పెను తుపాను విధ్వంసానికి అతలాకుతలమైన గ్రామీణ జనజీవనం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పాలకొండ
మన్యం జిల్లా పాలకొండ మండలంలో అర్నబ్ తుపాను తీవ్రతకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఓనిగడ్డ వాగు భారీ ప్రవాహంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా నిలిచింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.