హీరోయిన్ల బిజీపై నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు వైరల్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

కార్తీ సర్దార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్స్ కి డేట్స్ అడగగానే హీరోయిన్లు బిజీ అని చెబుతుంటారని, అసలు వాళ్ళు నిజంగా అంత బిజీగా ఉంటారా లేదా అని తెలుసుకోవాలని ఆయన అన్నారు. హీరోలు, దర్శకులకంటే హీరోయిన్లకే ఎక్కువ బిజీ ఉండటంపై తనకు అనుమానం ఉందంటూ నాగవంశీ చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.